తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి పర్వాతాలు అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. కాగా ఆ గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్య మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పర్వతాలు మృతదేహం వద్ద నివాళులర్పించి, మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ ఒడ్డెపల్లి లక్ష్మీభూమయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు చింతల రాజయ్య, అంబాల మధునయ్య, ఒడ్డెపల్లి అరుణసమ్మయ్య, ఒడ్డెపల్లి రాజయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: