పోతిరెడ్డిపల్లిలో పరిపాటి జన్మదిన వేడుకలు
తెలంగాణ అక్షరం-వీణవంక
వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదినాన్ని వీణవంక మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ గ్రామ అధ్యక్షుడు గజ్జల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ వీణవంక మండలంలోని వివిధ గ్రామాల్లో మరియు పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఎంతో మంది నిరుపేద కుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారని కొనియాడారు. ఆ భగవంతుని ఆశిషులతో నిండు నూరేళ్ల పాటు సల్లగా ఉండాలని మనసారా కోరుకుంటు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెవుల ఐలయ్య తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రాపర్తి శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ శంకర్ రమేష్ అఖిల్ మహేందర్ సునీల్ రాకేష్ అక్షయ్ రాకేష్ అభిలాష్ వివేక్ నితిన్ తదితరులు పాల్గొన్నారు.