తెలంగాణఅక్షరం-హనుమకొండ
రెడ్డి కాలనీలోని ఏకశిలా కాన్సెప్ట్ స్కూల్ లో ప్రీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనoగా జరిగాయి. ఈ సందర్భoగా ఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ గౌరు.తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో అన్నీ మతాల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో తమ పాఠశాలలో ప్రతి పండుగను నిర్వహిస్తునట్లు తెలిపారు.మతాలు వేరైన సోదరబావంతో కలిసి మెలసి మెలగాలని సూచిoచారు. నేటి తరానికి క్రీస్తు భోధనలు అనుసరణీయం అన్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు,ఉపాద్యాయులు కలిసి యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశంగా గడ్డితో పాకను నిర్మించి,యేసు ప్రతిమను, క్రిస్మస్ ట్రీ ని పెట్టి ప్రార్థనలు చేశారు. ప్రీ ప్రైమరీ పిల్లలు ఏoజెల్స్ , క్రిస్మస్ తాత వేషదారణలో అలరిoచారు. ఈ కార్యక్రమoలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ స్వప్నా రెడ్డి, ఉపాద్యాయులు శోభ,పావని,సుమ,హరినాథ్ ,విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.