కరీంనగర్ జిల్లా హిమ్మత్ నగర్ లో ఘటన
తెలంగాణఅక్షరం-వీణవంక
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ఎండి ఆసిఫ్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మ్యాక శ్రీనివాస్ వ్యవసాయం తో పాటు ఇద్దరు పిల్లల చదువుకు సుమారు రూ. 8 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియక జీవితం విరక్తి చెంది పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం జమ్మికుంటకు తరలించారు. కాగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబంకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Please follow and like us: