ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
మానేరు విధ్వంసంపై, ఇసుక క్వారీల అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని మానేరు తీరం వెంట ఉన్న కొండపాక ఇసుక క్వారీని ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో డిసిల్టేషన్ పేరుతో మానేరులో విచ్ఛల విడిగి ఇసుక క్వారీలను నెలకొల్పి వేల కోట్ల అవినీతి కారకులైన ఇసుక మాఫియాను శిక్షించాలని ప్రభుత్వానికి విన్నవించుకునానరు. కుట్రపూరితంగా చెక్ డ్యాములు పూర్తిస్థాయిలో నిర్మించకుండా రాజకీయ నాయకులతో మాఫియా కుట్ర పన్ని జిల్లాలోని వీణవంక, జమ్మికుంట మడలాల్లో ఆరు క్వారీల ద్వారా వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. దీని వల్ల స్థానిక రైతాంగం తీవ్రంగా జీవనోపాధి లేక తీవ్రంగా దెబ్బతిందని, ఇసుక లారీల ద్వారా రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని ఈ విషయంపై ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా రాజకీయ నాయకుల అండదండలు, అధికార యంత్రాంగం, డబ్బు, పలుకుబడితో న్యాయ స్థానాలల్లో కేసులు వేస్తే కాలక్షేపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉండగానే కలెక్టర్ మరో సంవత్సర కాలంపాటు ఇసుక క్వారీలకు అనుమతి ఇవ్వడంపై మండిపడ్డారు. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు కొనసాగుతున్న తరుణంలో తుది తీర్పు వచ్చే వరకు ఇసుక క్వారీలను నిలుపదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో కొండపాక ఉప సర్పంచ్ రామగుండం రాజుకుమార్, కాంగ్రెస్ నాయకులు సుంకరి రమేస్, ఎండీ సలీం, సాహెబ్ హుస్సెన్, ఎగ్గని శ్రీనివాస్, సంది సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.